అంతర్‌ రాష్ట్ర బదిలీలకు జూన్‌ వరకు గడువు పొడిగింపు

0
11

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఉద్యోగుల అంతర్‌ రాష్ట్ర బదిలీలకు గడువును తాజాగా జూన్‌ వరకు పొడిగించింది. ఈ బదిలీలకు సంబంధించి రెండు రాష్ట్రాలు సంయుక్తంగా మార్గదర్శకాల ను విడుదల చేశాయి. భార్య ఒక రాష్ట్రంలో, భర్త ఇంకో రాష్ట్రంలో ఉద్యోగం చేయడం, అలాగే మ్యూచువల్‌ విధానంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వస్తామని ఇష్టపడిన ఉద్యోగులను బదిలీ చేయడానికి 2017 నవంబరు 27న కొన్ని మార్గదర్శకాలు వాటితో పాటు నిబంధనలు కూడా విడుదల చేశారు. దరఖాస్తులు పంపడం, ఆ యా శాఖల దరఖాస్తులను ప్రాసెస్‌ చేయడానికి నెల నుంచి 2 నెలల వరకు సమయం ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here