ఇంటెక్స్ ఎలైట్ డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

0
16

ఇంటెక్స్ తన ఎలైట్ డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌ను రీసెంట్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు గాను రాయల్ రెడ్ లిమిటెడ్ ఎడిషన్ వేరియెంట్‌ను ఇంటెక్స్ తాజాగా విడుదల చేసింది. రానున్న వాలెంటైన్స్ డేను దృష్టిలో ఉంచుకుని ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను ఇంటెక్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.6,999 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌లో ఫీచర్లు గతంలో వచ్చిన ఇంటెక్స్ ఎలైట్ డ్యుయల్‌లో మాదిరిగానే ఉన్నాయి. వాటిలో ఎలాంటి మార్పు లేదు.

ఇంటెక్స్ ఎలైట్ డ్యుయల్ ఫీచర్లు…

* 5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
* 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్
* 16 జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 7.1 నూగట్
* డ్యుయల్ సిమ్
* 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
* 8, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
* 2400 ఎంఏహెచ్ బ్యాటరీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here