ఏజెన్సీల్లో హైఅల‌ర్ట్‌…!

0
13

ఛత్తీస్‌గఢ్ : మ‌మావోయిస్టుల బంద్ నేప‌థ్యంలో చ‌త్తీస్‌గఢ్‌, భ‌ద్రాద్రి ఏజెన్సీల్లో పోలీసులు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. భకేలి – భాన్సీ మధ్యలో మావోయిస్టులు.. రైలు పట్టాలను తొలగించారు. దీంతో 6 గూడ్స్ బోగీలు పట్టాలు తప్పాయి. కిరండోల్‌లో సాగునీటి ప్రాజెక్టుల కోసం పనులు చేస్తున్న ఓ ప్రొక్లెయిన్‌తో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఇవాళ్టి బంద్‌ను విజయవంతం చేయాలని పోస్టర్లు అంటించారు. జయశంకర్ భూపాలపల్లిలోని వెంకటాపురం మండలం ఎదిర వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూ.. వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here