కాంగ్రెస్ సంతాపసభ సంస్కారరహిత సభ..

0
15

నల్గొండ: కాంగ్రెస్ సంతాపసభ సంస్కారరహిత సభగా మారిందని మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ సభలో కాంగ్రెస్ నేతలు అన్న ప్రతి మాటపై న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇవాళ మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అబద్దాల కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి తాము మాట్లాడబోమని చెప్పారు. కాంగ్రెస్ పెంచి పోషించిన సంస్కృతిలోనే బొడ్డుపల్లి శ్రీనివాస్ బలయ్యారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో చేరకుంటే హత్యలు చేస్తారా? ఇంత నీచమైన మాటలు ఉంటాయా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో వందలాది రాజకీయ హత్యలు చేశారని ఆరోపించిన జగదీశ్ రెడ్డి.. నల్గొండ జిల్లా ప్రశాంతంగా ఉండటాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here