ఖాళీగా ఉండేకంటే ప‌కోడి అమ్మ‌డ‌మే మేలు….!

0
16

ఢిల్లీ : బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అధ్యక్షుడు అమిత్‌షా నేడు రాజ్యసభలో తొలిసారి ప్రసంగించారు. తాము అధికారంలోకి రాకముందు దేశ పరిస్థితి ఎలా ఉందో గుర్తుంచుకోవాలని, అప్పుడు విధాన వైఫల్యం చాలా ఎక్కువగా ఉండేదని పేర్కొన్నారు. గత మూడున్నరేళ్లలో ఆ పరిస్థితిని చాలా వరకు మార్చేశామని అన్నారు. మహాత్మా గాంధీ, దీన్‌దయాళ్‌ కలల్ని సాకారం చేసే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జన్‌ధన్‌ యోజన తమ గొప్ప విజయమని, 31కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించామని అన్నారు. అలాగే ప‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, తదితర అంశాల గురించి ప్రస్తావించారు. పేద ప్రజలు పకోడా అమ్ముకోవాలా? అని కాంగ్రెస్‌ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలపై అమిత్‌షా స్పందించారు. ఏమీ చెయ్యకుండా ఖాళీగా ఉండే బదులుగా కష్టపడి పనిచేసి పకోడా అమ్ముకోవడం మంచిదేనని అమిత్‌షా వెల్లడించారు. ఇప్పుడు పకోడా అమ్మినప్పటికీ, అతడి తర్వాత తరంలోనివారు పెద్ద వ్యాపారవేత్తలు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here