జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లిపై కేసు…!

0
18

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప జయకుమార్ పై ఓ వ్యాప‌ర‌వేత్త కేసు వేశారు. దీపంతో పాటు ఆమె భర్త మాధవన్, కారు డ్రైవర్ రాజా తనను మోసం చేశారని, రూ. 1.12 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఎరువుల వ్యాపారి రామచంద్రన్ చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జయలలిత మరణించిన తరువాత ఆమె మేనకోడలు దీప ఎంజీఆర్ అమ్మా దీప పేరవై పార్టీని స్థాపించారు. ఆ పార్టీలో తనకు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇప్పిస్తామని నమ్మించి రూ. 1.12 కోట్లు తీసుకున్నారని, తరువాత తనకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని, తీసుకున్న నగదు తిరిగి ఇవ్వలేదని సోమవారం రామచంద్రన్ చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రామచంద్రన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చెన్నై సిటీ పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here