న‌టి రెండో పెళ్లి…!

0
23

మలయాళ నటి దివ్య ఉన్ని మరోసారి వివాహం చేసుకొన్నారు. అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అరుణ్ కుమార్ మణికందన్‌ను రెండో వివాహం చేసుకొన్నారు. అమెరికాలోని హుస్టన్ గురువయప్ప ఆలయంలో జరిగిన ఈ వివాహానికి కొంతమంది సన్నిహితులు, కుటుంబసభ్యులు హాజరయ్యారు. మలయాళ చిత్రసీమలో 50 చిత్రాలకు పైగా దివ్య ఉన్ని నటించారు. 1996లో 14 ఏళ్ల వయసులోనే కల్యాణ సౌగంధికంగా చిత్రా తర్వాత కెరీర్‌ను ప్రారంభించారు. చివరిసారిగా 2013లో ముసాఫిర్ అనే చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత వివాహం చేసుకోవడం సినిమాలకు దూరమయ్యారు. అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుధీర్ శేఖరన్‌ను మొదట‌ వివాహంచేసుకున్నారు. వారికి అర్జున్, మీనాక్షి అనే ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు దివ్యతోనే ఉంటున్నారు. తాజాగా అరుణ్ కుమార్‌తో జరిగిన పెళ్లి విశేషాలను తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా దివ్య పంచుకొన్నారు. మీరు కురిపించిన ప్రేమ, దీవెనలు, ప్రార్థనలు ఫలించాయి. నా వివాహానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని దివ్య ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here