ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన ఖరారు

0
20

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనాకు తొలి చారిత్రక పర్యటన చేపట్టబోతున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది. ఫిబ్రవరి 10న రామల్లాకు మోదీ వెళ్తారని తెలిపింది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకూ ప్రధాని జరిపే పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌‌ కూడా వెళ్తారని ఆ ప్రకటన తెలిపింది.

‘పాలస్తీనా నుంచి ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈకి చేరుకుంటారు. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు ప్రధాని అక్కడకు వెళ్తున్నారు’ అని ఎంఈఏ తెలిపింది. పాలస్తీనాకు మోదీ వెళ్తుండటం ఇది మొదటిసారి కాగా, యూఏఈకి వెళ్తుండటం రెండోసారి. ఒమెన్‌లో పర్యటించనుండటం ఇదే ప్రథమం. ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా ఆయా దేశాల నేతలతో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పరస్పర ప్రయోజనాలు చేకూరే అంశాలపై కూడా చర్చిస్తారు. దుబాయ్‌లో జరిగే ఆరవ వరల్డ్ గవర్న్‌మెంట్ సమ్మిట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. యూఏఈ, ఒమెన్‌లో ఉన్న ప్రవాస భారతీయులను సైతం ప్రధాని కలుసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here