ప్రారంభమైన నీటి శుద్ధికి ఓఆర్‌ఎస్‌ఐ టెక్నాలజీ

0
16

విజయవాడ: మురికినీటిని శుద్ధి చేసి తాగునీరుగా మార్చే ప్రక్రియ వంద శాతం గ్యారెంటీతో అందిస్తున్నామని ఈ-వాటర్‌ హార్మనైజర్‌ ఎండీ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఈ నీటి శుద్ధికి సంబంధించిన ఓఆర్‌ఎస్‌ఐ టెక్నాలజీని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ… మురికి నీటిని నది నీరులా మార్చగల ఏకైక వాటర్‌ సాఫ్ట్‌నర్‌ ఈ ఓఆర్‌ఎస్‌ఐ టెక్నాలజీతో సాధ్యమని అన్నారు. ఈ ప్రక్రియలో నీటిని శుద్ధి చేయడంతో పాటు స్కేలింగ్‌ కూడా తీసివేస్తుందని పేర్కొన్నారు. ఈ యూనిట్‌ను ఇంట్లో రోజువారీ ఉపయోగించే నీటిని కూడా శుద్ధి చేసే విధంగా సిద్ధం చేశామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో, ఆదివారం విజయవాడలో ఈ యూనిట్‌ను ప్రారంభి స్తున్నామని ఆయన వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here