ప్రైవేటు బ‌స్సు బీభ‌త్సం.. 15 మందికి గాయాలు

0
15

అనంతపురం : దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బ‌స్సు బీభ‌త్సం సృష్టించింది. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపటంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద సోమవారం జరిగింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి నిరసనగా ప్రయాణికులు దివాకర్ ట్రావెల్స్ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. డ్రైవర్ మద్యం సేవించి ట్రావెల్స్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం ప్రమాదంపై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here