సామ్‌సంగ్ వార‌సుడు జే వై లీ విడుద‌ల‌

0
12

సియోల్ : ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ వారసుడైన జే వై.లీని అక్కడి అప్పీళ్ల కోర్టు విడుదల చేయాలని ఆదేశించింది. సామ్‌సంగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అయిన జే వై.లీకు అవినీతికి పాల్పడిన కేసులో గత ఏడాది కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ అవినీతి కుంభకోణంతో సంబంధంతో పాటు పలు అంశాల్లో అధికార దుర్వినయోగానికి పాల్పడిన కారణంగా ద.కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గెన్‌-హై గత ఏడాది పదవి నుంచి దిగిపోయిన సంగతి తెలిసిందే. తాజా విచారణలో కోర్టు వై.లీ శిక్షను తగ్గించింది. ఆయనపై ఉన్న మరికొన్ని ఆరోపణలను కొట్టేసి ఆయన విడుదలకు ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here