13 ఏళ్ల త‌ర్వాత బ‌య‌ట‌ప‌డ్డ భార్య బాగోతం…!

0
343

భ‌ర్త‌ను హ‌త్య‌చేసి సెప్టిక్ ట్యాంకులో ఖ‌ననం
విచార‌ణ‌లో విస్తుగొలిపే విష‌యాలు వెల్ల‌డి
ముంబ‌యి : క‌ట్టుకున్న భ‌ర్త‌నే క‌డ‌తేర్చి సెప్టిక్ ట్యాంకులో ఖ‌న‌నం చేసిన భార్య ఉదంతం 13 ఏళ్ల త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చింది. సెక్స్ రాకెట్ నడిపిస్తోందంటూ ఓ మహిళ ఇంటిపై దాడి చేసిన పోలీసుల‌కు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. వివ‌రాల్లోకి వెళితే బోయిసర్‌కు చెందిన ఫరీదా భారతి అనే మహిళ 13 ఏళ్ల కిందటే తన భర్తను చంపి ఇంటి వెనుకాల సెప్టిక్ ట్యాంక్‌లో ఖననం చేసింది. అదే ఇంట్లో వ్యభిచారం నడుస్తుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా.. ఆమె భర్త తాలూకు అస్తిపంజరం బయటపడింది. సోమవారం తొలిసారి దాడి చేసి నలుగురు యువతులకు విముక్తి కల్పించారు పోలీసులు. అయితే ఆమె వ్యభిచారంతోపాటు పలువురిని హత్య కూడా చేసిందన్న సమాచారంతో మరోసారి ఇంట్లో సోదాలు చేయ‌గా ఆమె భ‌ర్త అస్తిపంజ‌రం బ‌య‌ట‌ప‌డింది. దీనిపై ఆమెను విచారించగా.. 13 ఏళ్ల క్రితం తన భర్త సహదేవ్‌ (30)ను హత్యచేసినట్టు అంగీకరించింది. అతను నిద్రలో ఉన్నపుడు తలపై కొట్టి చంపినట్లు ఫరీదా చెప్పింది. అయితే అతన్ని ఎందుకు చంపిందన్నది ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here